• Other News
  • Live TV
  • పశ్చిమాసియా ఉద్రిక్తతలు- భారత్‌లో చిక్కుకుపోయిన విదేశీయులకు వీసా పొడిగింపు

    Reporter
    Journalist Chinna Telangana  |  March 14, 2026, 12:41 pm
    పశ్చిమాసియా ఉద్రిక్తతలు- భారత్‌లో చిక్కుకుపోయిన విదేశీయులకు వీసా పొడిగింపు

    పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. గల్ఫ్‌ ప్రాంతంలో కొన్ని గగనతల మార్గాలు మూసివేయడం, విమానాల రద్దు వంటి పరిణామాల వల్ల అనేక మంది విదేశీయులు భారత్‌లోనే ఇరుక్కుపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    భారత్‌లో చిక్కుకుపోయిన విదేశీయులకు వీసా పొడిగింపు ఇవ్వడంతో పాటు ఓవర్‌స్టే జరిమానాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఆ విషయాన్ని ఎక్స్‌ ద్వారా వెల్లడించింది. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాల కారణంగా ప్రయాణాలకు అంతరాయం ఏర్పడడంతో భారత్‌ను విడిచి వెళ్లలేని విదేశీయులకు ఉపశమనం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

    📰 e-Paper Clip
    Google News Follow